కక్షిదారులకు భారం అవుతున్న వెల్ఫేర్ స్టాంప్ పెంపును ఉపసంహరించుకోవాలీ !

కక్షిదారులకు భారం అవుతున్న వెల్ఫేర్ స్టాంప్ పెంపును ఉపసంహరించుకోవాలీ !
కందుకూరు జనసాక్షి:
క్రింద స్థాయి బార్ అసోసియేషన్ లను సంప్రదించ కుండా స్టేట్ బార్ అసోసియేషన్ ఏక పక్షంగా పెంచిన సంక్షేమ స్టాంప్ లను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ, కక్షిదారులకు భారం తగ్గించాలని కోరుతూ కందుకూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు మూడో రోజు కు చేరుకున్నాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యం.మల్లిఖార్జున రావు మాట్లాడుతూ ఈ పెంపు వలన కక్షిదారులపై భారం పడుతుంది అని అన్నారు. సీనియర్ న్యాయవాది బెజవాడ కృష్ణయ్య కొత్తూరి.హరి కోటేశ్వరరావు, పోకూరి కోటయ్య సి.హెచ్.హరి కృష్ణా మామిడాల మాల్యాద్రి దీక్షలో పాల్గొన్న న్యాయవాదులకు పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈరోజు దీక్షలో కె.మల్లిఖార్జునరావు, ముప్పవరపు కిషోర్ ,సి.హెచ్ నాగేంద్ర శర్మ, చెనికల.రమేష్, షేక్ మస్తాన్ వలీ, కరణం అరవింద్, పెట్లూరి మురళి, ఎ.వి.సుబరామయ్య, సి.హెచ్ రవీంద్ర ,సి.రాఘవేంద్రరావు లు పాల్గొన్నారు.న్యాయవాదుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన వారిలో సీనియర్ న్యాయవాదులు పి.భాస్కర్ రావు, వలేటి శ్రీధర్ నాయుడు, బి.వి.మురళీకృష్ణ, గౌడిపేరు కోటేశ్వరరావు,టి.అరుణ, బొందు రోశయ్య ,లింగాబత్తిన బ్రహ్మాయ్య ,చుండి మురళి, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం ఉధృతం చేస్తామని శిబిరాన్ని సమన్వయం చేసిన బార్ అసోసియేషన్ సెక్రటరీ యస్.పవన్ కుమార్ తెలిపారు.
What's Your Reaction?






